భావోద్వేగాల సమన్వయము, సామాజిక స్పృహనిండిన కవిత్వం

సైన్సు ఆగినచోట నుంచి ఆధ్యాత్మిక మొదలవుతుందన్న వివేకానందుని స్ఫూర్తికి ఉదాహరణగా నిలబడిన ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక గ్రంథం శ్రీ షిరిడి సాయినాథుని పై భక్తి పారవశ్యానికి ఒక అక్షర ప్రవాహం ఇది. కరోనా సమయంలో అసంకల్పితంగా ఏర్పడిన 52 అధ్యాయముల సంపూర్ణ పారాయణ గ్రంథం.
ఈ గ్రంథ పారాయణం చేసి ఎందరో అద్భుతమైన అనుభవాలను పొంది ఉన్నారు. విశేషమైన ఆదరణ పొందిన ఆధ్యాత్మిక గ్రంథం

వేల సంఖ్యలలో సమీక్షలు పొందిన అద్భుత రచన. చెత్త ఆలోచనల కన్నా, చెత్త కాదు కదా చెత్త బండి! అనే మకుటంతో సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల పైన అసమానతల పైన సంధించిన తీవ్ర బాణం చెత్త బండి.

ఇరవై ఏడువేల రామాయణంలోని శ్లోకాలను,108 చిట్టి గేయాలలో పిల్లల కోసం పాడుకోవడానికి సులభంగా రచించిన సంపూర్ణ రామాయణం రంగుల పుస్తకంలో అందంగా అందించబడింది. చాలా స్కూళ్లలో దీనిని పిల్లలకి బోధిస్తున్నారు.
క్రింద లింక్ ద్వారా వినవచ్చు!

ఈ సంపుటిలోని కవితలు నా ప్రతిభకు నిదర్శనాలు కావు. నా హృదయ స్పందనలకు సాక్ష్యాలు. ఇవి నా ఊహల పుష్పాలు కావు, నా అంతరంగపు గాయాలు. ఇవి పదాలతో నిర్మించిన కట్టడాలు కావు, కాలం ముందు నిలబెట్టిన ప్రశ్నలు.
ఈ కవితలు చదివిన తర్వాత ఒక్క మనిషి అయినా మరింత సున్నితంగా ఆలోచిస్తే, ఒక్క హృదయం అయినా మరింత కరుణతో స్పందిస్తే, ఒక్క మనసు అయినా మానవత్వం వైపు అడుగు వేస్తే, ఈ రచనకు అంతకంటే పెద్ద గుర్తింపు నాకు అవసరం లేదు. అప్పుడు ఈ అక్షరాలు తమ ప్రయోజనాన్ని నెరవేర్చినట్లే. అప్పుడు నా ఆవేదనకు అర్థం దొరికినట్లే. అప్పుడు నా జన్మ ధన్యమైనట్లే.

 తెలంగాణ మాండలికంలో వివిధ పోటీలలో బహుమతులు పొందిన రమాదేవి కులకర్ణి ఇరవై రెండు అద్భుతమైన కథల సమాహారం ఈ గగ్గమ్మ కథలు